అమరావతి శంకుస్థాపనకు వెళ్లేందుకు కేటీఆర్ రెడీ

ktrతెలంగాణ పంచాయత్ మంత్రి కేటీఆర్ తను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపనకు పిలుస్తే వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతామని అన్నారు

తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని , రాజధాని శంకుస్థాపనకుఆహ్వానిస్తే తప్పకుండా వెళతామని , తెలంగాణ ఏర్పాటు వల్ల ఆంధ్ర ప్రజలకు మేలే జరిగిందని, విభజన తర్వాత ఎపిలో విజయవాడతో పాటు పలు పట్టణాలు అబివృద్ది చెందుతున్నాయని, రాష్ట్ర విభజన జరగకపోతే అమరావతి నగర వచ్చేదే కాదని అన్నరు.

ఈ నెల 18 న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసి అమరావతి శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించనున్నారు.