పోస్టర్స్ తో హైప్ పెంచుతున్న కృష్ణ వంశి

nakshatram Krishna Vamsi creating hype with Nakshatram poster

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘నక్షత్రం’ సినిమాకు సంబంధించి ఇప్పటికే సందీప్ కిషన్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, సాయి ధరమ్ తేజ్, ప్రకాశ్ రాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో లుక్ విడుదలైంది.

యువ నటుడు తనీష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడని తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ బట్టి తెలుస్తోంది.

“పోలీస్” అవ్వాలనే ప్రయత్నం లో వున్న ఓ యువకుడి కథే ఈ “నక్షత్రం” . ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఈ చిత్రంపై ఎక్సపెక్టషన్స్ ఓ రేంజిలో పెంచుతున్నారు. ఇది మరో ఖడ్గం అవుతుందని ఇండస్ట్రీలో టాక్ .