కొరటాల శివ మూడో చిత్రానికి హీరో ఎవరు ?

Srimanthudu Movie Director Koratala Siva Press Meet Stills

Srimanthudu Movie Director Koratala Siva Press Meet Stills

ప్రభాస్ మిర్చి , మహేష్ బాబు శ్రిమంతుదితో ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ. కాగా తన మూడో చిత్రానికి హీరో ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది .

టి-టౌన్ వర్గాల బట్టి , కొరటాల శివ మూడో సినిమా యూనివర్శిల్ మీడియా బ్యానర్ పై డి.వి.వి దానయ్య నిర్మించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించబోతున్నాడని సమాచారమ్.

ఆ స్టొరీ లైన్ ని ప్రభాస్ మిర్చి కంటే ముందే డెవలప్ చేసి అల్లు అర్జున్ కి కొరటాల శివ ఓ కథ చెప్పాడట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తను చేస్తున్న చిత్రం పూర్తయిన వెంటనే ఈ సినిమా చేద్దామని అల్లు అర్జున్ శివకు మాటిచ్చాడట. ఈ యేడాది చివరిలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది