పవన్‌ ఆస్తులు కాపాడుకోడానికి కేసీఆర్‌ను కాకపడుతున్నారు

pawan3ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడి మళ్లీ నిద్రావస్థలోకి వెళ్లి ఆరునెలల తర్వాత మళ్లి రావటం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అలవాటని టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు.

పవన్‌ వ్యాఖ్యపై ‘‘తిడితే కేసీఆర్‌లా తిట్టాలి.. పడితే సీమాంధ్ర ఎంపీల్లా పడాలి’’స్పందిస్తూ అంత పౌరుషం లేకుండా సీమాంధ్ర ఏంపీలు, ప్రజలు లేరని అన్నారు.

పవన్‌ తన ఆస్తులు కాపాడుకోడానికి, సినిమాలు ఆడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కాకా పట్టాలని చూస్తున్నారని కేశినేని నాని విమర్శించారు. ఆర్నెళ్లకొకసారి నిద్రలేస్తే మేం ఏం చేస్తున్నామో ఎలా తెలుస్తుందని ఆయన మండిపడ్డారు. మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ ఎంపీలపై పవన్‌ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు.

విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు రూ. 250 కోట్లు విడుదల చేశారని, ఏపీకి ప్రత్యేక హోదాపై ఏపీ ఎంపీలు పలుమార్లు పార్లమెంట్‌లో మాట్లాడారని, ఆయన చెప్పుకోచారు .

హైదరాబాద్‌లో శాంతి భద్రతల సమస్యలు పవన్‌కు కనిపించడంలేదా?, హైదరాబాద్‌లో సెక్షన్‌-8 అవసరం లేదని చెప్పడం సరికాదని కేశినేని నాని అన్నారు.