కెసిఆర్ రేవంత్ కు క్షమాపణ చెప్పాలి, కెసిఆర్ ను అరెస్టు చేయాలి : టిడిపి డిమాండ్లు

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని తెలంగాణ శాసనసభలో టిడిపి నేత ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు.

న్యాయం తమవైపు ఉన్నందున రేవంత్ కు బెయిల్ వచ్చిందని ఆయన అబిప్రాయపడ్డారు.అందువల్ల రేవంత్ కు క్షమాపణ చెప్పి కెసిఆర్ ఈ కేసును ఉపసంహరించుకోవాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

మరోవైపు , ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మీడియాతో మాట్లాడుతూ టెలిపోన్ టాపింగ్ కేసులో మొదటి ముద్దాయి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను అరెస్టు చేయాలని టిడిపి డిమాండ్ చేశారు.

హైదరాబాద్ పై రెండు రాష్ట్రాలకు హక్కు ఉందని, ఇక్కడ తమ సిబ్బంది ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్ లు తమవి కూడా ఉండాలని అన్నారు.