స్మితాసభర్వాల్‌పై అసభ్య క్యారికేచర్‌పై కేసీఆర్ ఆగ్రహం

smitaఐఏఎస్‌ అధికారి స్మితాసభర్వాల్‌పై అసభ్య క్యారికేచర్‌ ప్రచురించిం ఆంగ్ల మ్యాగజైన్ ‘ఔట్‌లుక్పై క్రిమినల్ కేసు పెట్టాలని భావిస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

‘ఔట్‌లుక్’ ఒక అసభ్యకర క్యారికేచర్‌ను ప్రచురించింది ఇందులో స్మితాసభర్వాల్ అభ్యంతరకర దుస్తులతో ర్యాంప్‌ వాక్‌ చేస్తుండగా… సీఎం కేసీఆర్‌ ఫొటో తీస్తుంటే కొందరు రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఆ క్యారికేచర్‌ను ముద్రించింది.

అంతేకాక స్మిత ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించే సమావేశాలన్నిటిలో పాల్గొంటారని, కెసిఆర్ వచ్చే టైమ్ కు వస్తారని, ఆయన వెళ్లిపోయాక స్మిత కూడా వెళ్లిపోతారని ఇలా ఇవేవో రాశరు.

దీంతో సంబంధిత పత్రికపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, సీఎం రాజీవ్ శర్మలు ఆదేశించినట్టు సమాచారం.

మరోవైపు స్మిత సభర్వాల్ అవుట్ లుక్ పత్రికకు నోటీసు ఇచ్చారు. 15 రోజుల్లోగా తదుపరి సంచికలో క్షమాపణ చెప్పాలని, లేకపోతే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.