బంగారు తెలంగాణ గ్రామా అభివృద్ధితోనే సాధ్యం : కెసిఆర్

grama-jyotiతెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు నేటి ఉదయం 10.30 గంటలకు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ప్రారంభించారు.

గ్రామంలో మొక్కలు నాటి హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కమిటీల ద్వారా గంగదేవిపల్లిలో జరిగిన అభివృద్ధిని సిఎం స్వయంగా పరిశీలించారు. అనంతరం నల్లబెల్లి మండలం మేడిపల్లిలో రాంపూర్ – మేడిపల్లి జంట గ్రామాల గ్రామసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు . మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్నినిర్వహించారు

ఈ సందర్భంగా కేసీఆర్ గంగదేవిపల్లి గ్రామస్తులపై ప్రశంసల జల్లు కురిపించారు. గంగదేవిపల్లి అభివృద్ధికి రూ.10కోట్లు కేటాయిస్టున్నట్టు ప్రకటించారు. ప్రజాప్రతినిధులుపై ఆధారపడకుండా ఇక్కడ అభివృద్ది జరుగుతోందని సీఎం ప్రశంసించారు. ప్రజలంతా ఐక్యమత్యంగా ఉంటే సమస్యలు అవే పరిష్కారం అవుతాయని సూచించారు. గంగదేవిపల్లి గ్రామమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. గ్రామాలను అభివృద్ధి చేసుకుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమని కేసీఆర్ అన్నారు.

హన్మకొండలోని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మికాంత రావు ఇంటికి వెళ్లి రాత్రికి అక్కడే బస చేయనున్నారు సీఎం. రెండవ రోజు పర్యటనలో ముఖ్యమంత్రి వరంగల్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.