11 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవటం ఖాయo : దయాకర్‌

kcrతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి సిఎం కావడం ఖాయమని , రానున్న 11 నెలల్లో కేసీఆర్ ప్రభుత్వం పడిపోవటం ఖాయమని టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌ రెడ్డి జోస్యం చెప్పారు.

ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌లో ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని కలిశారు, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎంగా రేవంత్‌రెడ్డి ఖాయమని చెప్పారు.

సీఎం పదవి నుంచి కేసీఆర్‌ దిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చే ఎన్నికలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తున్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గొంతునొక్కేందుకు కేసీఆర్‌ శతవిధాల ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.