చార్మినార్ ను కాదు కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలి

Errabelli Dayakar-466464తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యాలు చార్మినార్ ని కూల్చాలని దుమారం రేపుతున్నాయి. టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. కూల్చాల్సింది చార్మినార్ ను కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆయన అన్నారు.

చార్మినార్ లాంటి చారిత్రక కట్టడాలు హైదరాబాద్ కు తలమానికం అని అలాంటి వాటిని కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ ది మూర్ఖపు ఆలోచన అని, కూలగొట్టాల్సింది కేసీఆర్‌నే కాని వారసత్వ కట్టడాలను కాదని ఆయన అన్నారు.