సిబిఐ కేసు నుంచి బయటపడేందుకే కేసీఆర్ డిల్లీ టూర్ : టిడిపి

KCRతెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సిబిఐ విచారించిన విషయం తెలిసిందే, తరువాత కేసీఆర్ డిల్లీ పర్యటన చేపట్టారు , ఐతే తెలంగాణ టిడిపి మాత్రం సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకే కేసీఆర్ డిల్లీ పర్యటన చేపట్టారని ఆరోపిస్తుంది .

టిడిపి తెలంగాణ అద్యక్షుడు ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ , కేసీఆర్ తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐలో జరిగిన అవినీతిపై సీబీఐ ప్రశ్నించిందని,దానిపై కెసిఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ? , అవినీతికి పాల్పడితే కొడుకు, కుమార్తెను కూడా ఉపేక్షించబోనని చెప్పిన కెసిఆర్ ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ? రమణ ప్రశ్నించారు.

ఎలుగుబంటి సూర్యనారాయణ తో కెసిఆర్ సంబంధాలు ఏమిటని ?, సిబిఐ కేసు నుంచి బయటపడేందుకే చండీయాగం పేరుతో డిల్లీ టూర్ ను చేస్తున్నారని, మౌనం వీడి సమాధానం చెప్పాలని కెసిఆర్ ను, రమణ డిమాండ్ చేశారు.