పూర్వ వైభవం తేవడమే గ్రామజ్యోతి లక్ష్యం : కెసిఆర్

grama-joithyముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో ‘గ్రామజ్యోతి’ అవగాహన సదస్సు జరిగింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను తీర్చిదిద్దుకోవడమే గ్రామ జ్యోతి లక్ష్యం.

“ఈ పథకం కింద రాబోయే నాలుగేళ్లలో వివిధ శాఖల ద్వారా రు. 25 వేల కోట్లు ఖర్చు పెడతాం అని అన్నారు సిఎం . గంగదేవిపల్లి, అంకాపూర్, ముల్కనూర్ గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలె, గ్రామసభల్లో సర్పంచ్‌, ఎంపిటిసి, ఎంపిపి, జడ్‌పిటిసిలు పాల్గొని గ్రామాల ప్రణాళికలు తయారు చేయాలి అని అన్నారు సిఎం

ఎమ్మెల్యేలు మండలానికో గ్రామాన్ని దత్తత తీసుకుని ప్లాన్‌ చేయాలి. ఆ గ్రామాలను మిగతా గ్రామాలకు ఆదర్శంగా చూపాలి, గ్రామాల్లో వందశాతం అక్షరాస్యత సాధించాలి. చదువుకున్న యువతను ఉపయోగించి, గ్రామాల్లో అందరికీ చదువు నేర్పించాలి, పంచాయితీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తేవడమే గ్రామజ్యోతి లక్ష్యం , అన్నారు సిఎం

CM KCR addressing the awareness session on Grama Jyothi program, being held at Prof Jayashankar Agriculture University said, this program is meant to bring back the past glory of villages .