కాష్మోరా ఫస్ట్ వీక్ గ్రాస్ రూ.15 కోట్లు

kashmora1తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన చిత్రం ‘కాష్మోరా’. పీవీపీ సినిమా బేనర్‌లో ప్రసాద్‌ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దీపావళి బరిలో దిగిన ఈ సినిమాల్లో పెద్ద విజయం సాధించిన చిత్రం గా నిలిచింది .

‘కాష్మోరా’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన పివిపి మరో బిగ్‌ సక్సెస్‌ను అందుకున్నారు. కాష్మోరా’ రికార్డ్‌ కలెక్షన్స్‌ సాధించిందని నిర్మాత ప్రకటించారు . తెలుగు లో రూ.9 కోట్లు కి అమ్ముడు పోయిన ఈ సినిమా ఫస్ట్ వీక్ ల్లోనే రూ.15 కోట్లు కలెక్ట్‌ చేసి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది.

ఆవారా, యుగానికి ఒక్కడు, నాపేరు శివ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో తెలుగులో మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న కార్తీ.. కింగ్‌ నాగార్జునతో కలిసి ద్విభాషా చిత్రంగా చేసిన మల్టీస్టారర్‌ ‘ఊపిరి’ పెద్ద హిట్‌ అయింది. కార్తీకి తెలుగులో కూడా ఫాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ‘కాష్మోరా’కు వచ్చిన భారీ ఓపెనింగ్సే దానికి నిదర్శనం. ఈ సినిమా కార్తీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ సోలో సక్సెస్‌ కాబోతోంది.