జగన్ పై జూపూడి ఫైర్

jaganవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

పుష్కరఘాట్‌లోని ప్రమాదాన్ని రాజకీయం చేస్తూ కథలు అల్లి జగన్‌ ఛానెల్‌లో ప్రసారం చేయిస్తున్నారని జూపూడి ఆరోపించారు. పుష్కరాల గురించి ప్రభుత్వానికి జగన్ సూచనలు, సలహాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయనకు బాధ్యత లేదా? అని నిలదీశారు

రాజమండ్రి ఘటనపై కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు