పవన్ నోరు మాయించడానికే ప్రత్యేక హోదానా ధర్నా

pawan1పవన్ నోరు మాయించడానికే ప్రత్యేక హోదానా ధర్నా అని సంచలన వ్యాఖ్యలు చేశారు, టీడీపీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి . జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వంటి వాళ్ల నోళ్లు మూయించడానికే ఇటువంటివి తెరపైకి వస్తాయని ఆయన అన్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవని ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ గురువారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాపై జేసీ ఇలా వ్యాఖ్యలు చేశారు

మరోపక్క , కాంగ్రెస్ అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిందని, విభజన సమస్యలు జటిలంగా మారాయని, కేంద్రం వెంటనే దీనిపై జోక్యం చేసుకోవాలని, సభలో కాంగ్రెస్‌ వైఖరితో ఏపీకి తీరని నష్టం కలుగుతోందని , ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని టీడీపీ ఎంపీలు వ్యాఖ్యానించారు