తలుపులు మూసి ఏపీని విభజన చేసినప్పుడు బ్లాక్ డే కాదా?

jcపార్లమెంటు తలుపులు మూసి ఏపీని విభజించిన వాళ్ళకు బ్లాక్‌డే గురించి మాట్లాడే అర్హత లేదని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తీవ్రస్తాయిలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీఫై ఫైర్ ఇయ్యరు టీడీపీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి .

తలుపులు మూసి… కెమెరాలు ఆపి విభజన చేసినప్పుడు బ్లాక్ డే కాదా? అని ప్రశ్నించారు. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు శాశ్వత సమాధి కట్టారని ఆరోపించారు. సోనియాగాంధీ వల్లే కాంగ్రెస్‌ దిగజారిపోయిందన్నారు. కాంగ్రెస్‌ వల్లే ఆంధ్రప్రదేశ్‌కు కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.