2019 ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో పోటీ చేస్తా : పవన్ కళ్యాణ్

pawan-2019- electionsఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మనసులో మాట చెప్పారు.

2019 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రశ్నించడానికి జనసేన వచ్చిందని, ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని తను మరిచిపోలేదని , రెండు రాష్ట్రాలలోను పోటీచేస్తామని , సాంస్కృతికంగా ఏపీ, తెలంగాణ ఎప్పుడూ కలవలేవని ఆయన అన్నారు.

రాజకీయాల్లో తిట్టేవారిని, పొగిడేవారిని,భరించాలని రాజకీయాల్లో ఏం చేస్తానో చెప్పి చేస్తానని ,పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే సినిమాలు మానేస్తానని, ఈ క్షణం నుంచే కార్యాచరణలో ఉన్నానని ,రాజకీయంగా అన్నయ్యతో అభిప్రాయ భేదాలు ఉన్నాయని అయితే తన అన్న తనకు ఆదర్శమే అని అన్నరు.