జనసేన పార్టీ మీడియా టీం వీరే

pawan2జనసేన పార్టీ సమన్వయకర్తలను నియమించింది, ఆంధ్రా తెలంగాణలకు చెందిన నలుగురిని తమ సమన్వయకర్తలగా పేర్కొంటూ మీడియాకు ప్రకటన విడుదల చేసింది. సమన్వయకర్తలగా  1. బింగునూరి . మహేందర్ రెడ్డి 2.రియాజ్ 3. నర్సింహా 4.శంకర్ గౌడ్ లు ఉన్నారు.

సమన్వయకర్తల్లో కూడా సామాజిక సమీకరణలు, ప్రాంతాలను కూడా పవన్ కళ్యాణ్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బిసి, మైనార్టీ, ఓసీ, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారిని నియమించడంతో పవన్ కళ్యాణ్ అన్ని వర్గాలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా కనబడుతోంది.

మరోపక్క పవన్ ట్వీట్లు ఇస్తూ.. తనపై కొందరు కేసు పెట్టాలనుకుంటున్నారని, కోర్టుకైనా.. జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని పవన్‌ స్పష్టం చేశారు. ఆ తర్వాత మరి కొన్ని గంటలకు మరో విడత ట్వీట్లు ఇచ్చారు. “సీమంధ్రా MPలు పౌరుషము నా మీద కాదు, కేంద్రం దగ్గర చూపించండి. నన్ను తిడితే ‘SPECIAL STATUS’రాదు, MPలు.. వ్యాపారము చేయడము తప్పు కాదు, కేవలం ‘వ్యాపారమే’ చేయడము తప్పు” అంటూ ఎంపీలను ఉద్దేశించి ట్వీట్స్ ద్వారా వ్యాఖ్యలు చేశారు.