పవన్ కళ్యాణ్ పిలుపుకు స్పందించిన జనసేన కార్యకర్తలు

pawan2జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు, ” సహాయక చర్యలకు తోడ్పాటు అందించ వలసినదిగా ‘జనసేన’ కార్య కర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను ” స్పందిస్తూ జనసేన కార్యకర్తలు గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద పుష్కర స్నానానికి వెచ్చే భక్తులకు మంచినీళ్ళు, మజ్జిగ అందిస్తున్నారు. ఇక నడవలేని వారిని ఎత్తుకొని ఘాట్ లు దాటిస్తూన్నారు.

జూలై 14వ తేదీన రాజమండ్రి కోట గుమ్మం పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనలో 27 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు, దుర్ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పదించిన సంగతి తెలిసిందే. జనసేన కార్యకర్తలు పుష్కరాల్లోని భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.