కెసిఆర్ గెలుపు కోసం అందరికంటే జగన్ నే ఎక్కువ కష్టపడుతున్నాడు

Jagan-struggling-for-KCR-victory-in-warangalవరంగల్ ఉపఎన్నికల్లో కెసిఆర్ గెలుపు కోసం తెరాస పార్టీ నాయకుల కంటే వైసీపీ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రెడ్డి ఎక్కువ కష్టపడుతున్నాడని, కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.

జగన్ గత రొండు రోజులనుంచి వరంగల్ లో సుడిగాలి ప్రచారం చేసున్నాడు, కెసిఆర్ 18 నెలలుగా మోసం చేస్తున్నారన్నారని, కెసిఆర్ ను నిలదీయమని , వరంగల్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు ప్రజలు గుణపాఠం చెపాలని ప్రజలను కోరారు. . కెసిఆర్ చేతకాని పాలన చేస్తున్నారని, అసమర్దంగా పాలన చేస్తున్నారని అని కూడా అన్నారు .

ఐతే పొన్నం ప్రభాకర్ మాత్రం , జగన్ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి తెరాస వైసీపీని పోటీకి దింపిందని ,  కెసిఆర్ కు దిమ్మదిరిగేలా ప్రజలు టిఆర్ఎస్ ను ఓడించి తమ అభ్యర్ధి సర్వ్ సత్యనారాయణ ను గెలిపించాలని పొన్నం అన్నారు.