రుజువు చేస్తే రాజీనామా చేస్తా : జగన్

jaganఓటుకు నోటు వ్యవహారంలో మే 21న కుట్ర జరిగిందని దానికి జగన్ నే సూత్రదారి అని తెలుగు దేశం అచ్చెన్నాయుడు అన్నారు.

తనపై వచ్చిన ఆరోపణలను వైసీపీ అధినేత జగన్ ఖండించారు , హరీష్-స్టీఫెన్‌ను తాను కలిసనట్టు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు . అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఆరోపణలు నిజం కాదని రుజువైతే…చంద్రబాబు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. ప్రత్యేక హోదాపై కేంద్రానికి చంద్రబాబు డెడ్‌లైన్‌ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు నుంచి బయట పడేందుకే ప్రత్యేకహోదా పై  చంద్రబాబు  సైలెంట్ ఉన్నారని  జగన్ అన్నారు..