జగన్ మోహన్ రెడ్డి దీక్ష వాయిదా

jaganవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష వాయిదా ఈ నెల 26 నుంచి గుంటూరులో తలపెట్టిన నిరవధిక దీక్ష వాయిదా పడింది.

వైఎస్ఆర్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా తో మాట్లాడుతూ , వైఎస్ఆర్ సీపీ దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్ను శుక్రవారం హైకోర్టు తిరస్కరించిదని , రెగ్యులర్ పద్దతిలో రావాలని హైకోర్టు సూచించిదని , అనుమతి కోసం సోమవారం మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని తెలిపారు .

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని అయన అన్నారు .