జగన్ శవ రాజకీయం చేసున్నారు : తెలుగు దేశం

jaganరాజమండ్రి పుష్కర మృతుల పట్ల చంద్రబాబు ప్రసంగం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్న జగన్ వ్యాఖ్యలపై అధికారపక్షం నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

గోదావరి మృతుల సంతాపంపై యావత్ ఏపీ ప్రజలు ఎదురు చూస్తుంటే వారిని జగన్ కించపర్చేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరణించిన వారి శవాలపై రాజకీయం చేసి వారి పునాదులపై ఏర్పడిన పార్టీ వైఎస్సార్ పార్టీ అని టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అన్నరు .

సంతాపం తీర్మానం కాకుండా జగన్ ఫ్యాక్షన్ సందేశం ఇస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం కుదరదని యనమల అన్నరు .