జగన్ ది దొంగ దీక్ష, కొంగ జపం : తెదేపా

 

jagan-1రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ బుధవారం గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జగన్‌ చేసున్న నిరాహారదీక్షలో చిత్తశుద్ధి లేదని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై భాజపా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని స్పష్ట్టం చేశారు.

జగన్ దొంగ దీక్ష చేస్తున్నారని, ప్రత్యేక హోదా పై ప్రతిపక్ష నేతకు అసలు అవగాహహనే లేదని , అది కొంగ జపమేనని అన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య.

మరోపక్క పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆద్వర్యంలో జగన్ దీక్షకు టిడిపి కౌంటర్ ర్యాలీ నిర్వహించారు. .జగన్ దీక్ష చేపట్టడానికి ముందు ఆస్తులు అప్పగించాలని డిమాండ్ చేశారు.

జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే దీక్ష చేపట్టారని ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. జగన్‌‌కు దీక్ష చేసే అర్హత లేదని, అమరావతి  శంకుస్థాపన సమయంలో ప్రత్యేకహోదా కోరుతూ దొంగ దీక్ష చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.