గ్రామజ్యోతి కాదు టిఆర్ఎస్ జ్యోతి

ravulaతెలంగాణ ప్రబుత్వం చేపట్టిన గ్రామజ్యోతి పధకం టిఆర్ఎస్ జ్యోతిగా మారిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నేత రావుల చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు.

జనాన్ని ఫూల్స్ చేసే విదంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారని, గతంలోని మన ఊరు మన ప్రణాళికకు గ్రామజ్యోతికి తేడా ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జి.ఓ. 63 , 64 లు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని ఆయన అన్నారు.దీనివల్ల సర్పంచ్ ల స్థాయిని దిగజార్చేలా ఆ జీవోలున్నాయని రావుల విమర్శించారు.