వర్మ ట్వీట్స్‌ను పట్టించుకోను : చిరంజీవి

khaidi-chiru1మెగాస్టార్ చిరంజీవి సోమవారం తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, ఖైదీ నంబరు 150 ప్రీరిలీజ్‌ కార్యక్రమం సందర్భంగా నాగబాబు వ్యాఖ్యలు చేయటం, దానిపై దర్శకులు రాంగోపాల్‌ వర్మ స్పందిస్తూ వరుస ట్వీట్లు పై స్పందించారు.

ఖైదీ నెం.150 చిత్రం ప్రీలాంచ్ వేడుక వేదికపై నాగబాబు మాట్లాడుతూ యండమూరి వీరేంద్రనాథ్, రాంగోపాల్ వర్మల పేర్లు ప్రస్తావించకుండా వారిని తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. దానిపై వర్మ కూడా అదేస్థాయిలో ప్రతిస్పందిస్తూ వరుసపెట్టి ట్వీట్లు చేస్తున్నారు.

ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ ట్వీట్స్‌ను పట్టించుకోనని.. నాగబాబు ఏదో సందర్భంలో హర్ట్‌ అయి ఉంటాడు కాబట్టే అలా స్పందించారన్నారు. ‘‘నాగబాబు ఎక్కువగా మాట్లాడరు. కానీ ఆ రోజు మాట్లాడడానికి ఓ వేదిక దొరికింది. వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవు. ఆర్జీవీ కూడా నాతో బానే ఉంటారు. కానీ.. ఇప్పుడు ఎందుకు అలా ట్వీట్లు చేస్తున్నారో తెలీటం లేదు’’ అని చెప్పారు.