పదేళ్ల తరువాతే హైదరాబాద్‌ తెలంగాణకు రాజధాని : చంద్రబాబు

Chandrababu_Naidu_Bulletప్రధాని మోదీని చంద్రబాబు కలిసే సమయం ఖరారైంది ఈనెల 20వ తేదీన ఢిల్లీలో ఏపీ సీఎం ప్రధానితో భేటీ అవుతారని అధికారికంగా ప్రకటించారు.

సోమవారం రాత్రి విజయవాడ క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడుతూ, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏపీకి అన్ని రకాలుగా అన్యాయం చేశారు. ఆస్తులన్నీ తెలంగాణకు, అప్పులన్నీ ఏపీకి ఇచ్చారు, విభజనను ఓ శాసీ్త్రయత లేకుండా చేశారు. విభజన సమయంలో ఆస్తులు ప్రాంతాన్ని బట్టి, అప్పులను జనాభా ప్రాతిపదికన ఇవ్వడం వల్ల నష్టపోయామని చంద్రబాబు అన్నారు.

సెక్షన్‌-5, 8 ప్రకారం ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని చంద్రబాబు పేర్కొన్నారు. పదేళ్ల తర్వాత మాత్రమే హైదరాబాద్‌ తెలంగాణకు రాజధాని అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి చెందే వరకు కేంద్రం ఆదుకోవాలి, ఈ నెల 20న ప్రధానితో సమావేశంలో చర్చిస్తా అన్నారు