ఎపి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో హై డ్రామా

andhraఎపి ప్రత్యేక హోదాపై హై డ్రామానే నడిచింది ఇవేళ పార్లమెంట్లో , తెలుగుదేశం , వైఎస్ ఆర్ కాంగ్రెస్ రొండు పార్టీలు ఇదే అంశం మాటలు పదును పెట్టాయి .

వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి వెంటనే ప్రత్యేక హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని, హోదా విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే తాము కూడా స్పీకర్ పోడియంలోకి వచ్చి నినాదాలు చేయవలసి ఉంటుందని మేకపాటి హెచ్చరించారు. ప్రత్యేక హోదాపై ప్రజలలో తీవ్ర అలజడి ఉందని ఆయన అన్నారు.

మరోవైపు , కేంద్రంలో తమకు రెండు మంత్రి పదవులు ముఖ్యం కాదని , ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ముఖ్యమని టిడిపి ఎమ్.పి  శ్రీనివాసరావు- అనకాపల్లి అన్నారు. బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పెట్టిందని ఆయన గుర్తు చేశారు. ఎపి ప్రజలంతా దీనిపై ఎంతో ఆశ పెట్టుకున్నారని అన్నారు.