రంజేత్మలని వాదన : ఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణా సర్కార్ కు ఊరట

ramjethmalaniఫోన్ టాపింగ్ కేసులో తెలంగాణా సర్కార్ కు ఊరట లబించింది , ఫోన్ టాపింగ్ వివరాలు ఇవ్వాలని, విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది.

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే అమల్లో ఉంటుందని హైకోర్టు తెలిపింది. కాల్ డేటా వివరాలను తనకు పంపించాలని హైకోర్టు ఆదేశించింది..

విజయవాడ కోర్టుకు సర్వీస్ ప్రొవైడర్లు వివరాలు సీల్డ్ కవర్ లో ప్రత్యేక మెసెంజర్ ద్వారా వాటిని హైకోర్టుకు పంపాలని హైకోర్టు ఆదేశించింది.

పోన్ టాపింగ్ చేసే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో వాదించింది. ప్రభుత్వం పక్షాన సీనియర్ రాంజెట్మాలని వాదించారు. విజయవాడ కోర్టుకు కాల్ డేటా ఇవ్వాలని ఆదేశించే హక్కు లేదని కూడా స్పష్టం చేశారు.