రావెల సుశీల్ పై నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు

ravelasusheelఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ పై నమోదైన కేసును ఉన్నత న్యాయస్థానం ఈరోజు కొట్టివేసింది.

రావెల సుశీల్ కారు నడుపుతూ ఓ ముస్లిం యువతి చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చిన విషం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. దీనిపై పోలీసులు సుశీల్ పై కేసులు కూడా పెట్టి సుశీల్ ను రేమండ్కు పంపారు.  బెయిల్‌పై వచ్చిన సుశీల్‌, తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు రావెల సుశీల్‌ ఎవరో తనకు తెలియదని ఫిర్యాదుదారు కోర్టులో అఫిడవిడ్‌ దాఖలు చేశారు.

దీంతో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సుశీల్ పై పెట్టిన కేసును తొలగిస్తున్నట్టు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.