కేసీఆర్‌కు GHMC కార్మికుల కృతజ్ఞతలు

kcrసీఎం కేసీఆర్‌కు GHMC పారిశుద్ధ్య కార్మికుల కృతజ్ఞతలు తెలిపారు. తమకు ప్రభుత్వం 47 శాతం వేతనాలు పెంచినందుకుగాను జీహెచ్‌ఎంసీ కార్మికులకు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు ఇవాళ కార్మిక నేతల ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు తమ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. మరింత ఉత్సాహంగా మరిన్ని ఎక్కువ గంటలు పని చేసేందుకు సిద్దంగా ఉంటామన్నారు. తమకు దశలవారీగా ఇండ్లు కట్టించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.