‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ ప్ర‌పంచ వ్యాప్తంగా వంద లోకేష‌న్స్‌లో

gautamiputraGautamiputra Satakarni trailer in 100 locations ww

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ విడుదల కనీవినీ ఎరుగని రీతిలో నిర్మాతలు ప్లాన్ చేసున్నారు .

చిత్ర నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ – జ‌న‌వ‌రి 12, సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను యు.ఎస్‌., యు.కె. స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా వంద లోకేష‌న్స్‌లో ఒకేసారి విడుల‌య్యేలా ప్లాన్ చేశాం. డిసెంబ‌ర్ మొద‌టివారంలో ఈ వేడుక‌ను గ్రాండ్ లెవ‌ల్లో పలువురు సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో నిర్వ‌హించ‌నున్నాం అని అన్నారు.

మరోపక్క దర్శకుడు క్రిష్ ఎక్కడా రాజీ పడకుండా చాలా జాగ్రత్తగా సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవ‌ల‌ విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ టీజ‌ర్‌ను 2.6 మిలియ‌న్స్ చూసారు .