రామోజీరావు – చంద్రబాబు మధ్య గ్యాప్ పెరిగిందా ?

naidu-ramojiఈనాడు’ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుకి – ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడికి మధ్య గ్యాప్ పెరిగిందా ?, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ఇదే విషయాని తెరాస లీడర్ కాచం సత్యనారాయణ కూడా అన్నారు .

వ్యాపారపరంగా, రాజకీయంగా బద్ధశత్రువులైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ‘ఈనాడు’ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుతో రామోజీ ఫిల్మ్ సిటీలో భేటి కావడం, తెలుగు దేశం పార్టీ వాళ్ళకు మింగుడు పడటం లేదనే చెప్పాలి . ఎందుకనగా ఏపీకి ప్రత్యేకహోదాకోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టబోతున్న జగన్ కు, రామోజీరావు మద్దతు పలుకుతున్నరనే సందేహం కూడా కలుగుతోంది . ఇదే కాదు , ఈనాడు-సాక్షి సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు బచావత్ కమిటీ సిఫార్సుమేరకు వేతనాలు పెంచేవిషయంలో కూడా రామోజీ, జగన్ మద్య ఒక్క అండర్స్టాండింగ్ ఉండనే చెప్పాలి .

కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీని వ్య‌తిరేకించిన జ‌గ‌న్ ఆ త‌ర్వాత తన కేసుల కోసం సోనియా గాంధీ తో రాజీప‌డ్డారనే ఆరోపణలు వచ్చాయి . ఇప్పుడు రామోజీ స‌త్తా ఏంటో ఆల‌స్యంగా తెలుసుకొన్న జ‌గ‌న్‌ ఆయనతో కూడా రాజీప‌డ్డారనే ఆరోపణలు వినుపిస్తున్నాయి .

తెలంగాణాలో చంద్రబాబుకు బద్ధశత్రువైన కెసిఆర్ కూడా స్వయంగా రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్లి గంటలకొద్దీ రామోజీతో సమావేశమయ్యారు. జగన్, రామోజీరావు భేటి వెనుక కెసిఆర్ కుడా ఉన్నారని ఉహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. .

రామోజీతో చంద్రబాబుకి విబేదాలు ఏర్పడాయనే చెప్పాలి , వారి మద్య బేధాభిప్రాయాలు ఉన్నాయనే అనుమానం కూడా కలుగుతోంది . చంద్రబాబునాయుడుకు రామోజీరావుతో విభేదాలు ఏర్పడితే , అది కెసిఆర్ కు మరియు జగన్ కె లబిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరోవైపు , తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఒక్క అడుగు ముందుకు వేసి జగన్‌ జైలుకెళ్లే పరిస్థితి రావడంతో రామోజీ దగ్గరకు వెళ్లారన్నారు. మరి ఈ మలుపులు భవిష్యత్ లో ఎట్టువైపుకి దారితీస్తుందో !!