అబ్దుల్ కలాం కన్నుమూత

abdul kalam-passed-away-373783787మాజీ రాష్ట్రపతి , భారతరత్న, డాక్టర్ అబ్దుల్ కలాం (84) సోమవారం రాత్రి షిల్లాంగ్‌లోని బెతాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు.

షిల్లాంగ్‌ ఐఐఎంలో ఈ సాయంత్రం ఆరున్నరకు జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగ సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని అక్కడి బెతాని ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కలాం పరిస్థితి విషమంగా మారింది.

ఆర్మీ డాక్టర్లు ఆయనకు చేసిన చికిత్స ఫలించలేదు. కలాం కడసారి చూపుకోసం దేశవ్యాప్తంగా ప్రముఖులు భారీ సంఖ్యలో షిల్లాంగ్‌కు చేరుకుంటున్నట్లు తెలిసింది.