రాజయ్య కుటుంబ సభ్యుల పైన ఎఫ్ఐఆర్ నమోదు

Siricilla-Rajaiah_380వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఇంట్లో ఈరోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల ఆయన మనువళ్లు అభినవ్, ఆయోన్, శ్రీయోన్‌లు మృతి నేపథ్యంలో విచారణ జరుగుతోంది.

వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, సారిక బెడ్‌రూమ్‌లోని గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ లీకేజీ కావడంతోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఐతే రాజయ్య కుటుంబ సభ్యుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని ఐజీ నవీన్ చంద్ తెలిపారు . సారికది హత్యనా లేక ఆత్మహత్యనా అనే విషయం విచారణలో తేలుతుందని చెప్పారు, క్లూస్ టీం ఆధారాలు సేకరించే పనిలో ఉందని వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారన్నారు అని తెలిపారు .

సారిక కుటుంబ సభ్యులు అమ్మ, చిన్నమ్మ ఘటనాస్థలికి వచ్చారని, పోస్టుమార్టం తర్వాత సారిక మృతదేహం వారికి అప్పగిస్తామన్నారు.