ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాడండి : పవన్

pawan5ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాడమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్ర ఎంపీలకు హితవు చెప్పారు. ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ, ఎన్డీయే రెండ చెప్పాయి అని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తామని యూపీఏ మాట ఇచ్చిందని, ఆ తర్వాత ఎన్డీయే కూడా దాన్ని సాకారం చేయడానికి ప్రయత్నించిందని, ఇపుడు ఏమైందని? ఆయన ప్రశ్నించారు.

తిడితే కేసీఆర్లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని ఆంధ్రప్రదేశ్ ఎంపీల్లా పడాలి అన్నమాటలను తాను విన్నానని, ఈరోజు పరిస్థితి చూస్తే అలాగే ఉందని ఆయన ఆవేశంగా అన్నారు. వాళ్లకు పౌరుషం, ఆత్మగౌరవం లేవా అని అనిపిస్తోంది. ఉత్తరాది ఎంపీలతో కొట్టించుకుని పార్లమెంటు నుంచి బయటకు వచ్చారు.

కేశినేని నాని తనకు ఎంపీ సీటు కావాలని బలంగా ఊగిపోయారు. ఇప్పుడేం చేస్తున్నారు? పార్లమెంటు గోడలు చూస్తూ ఆశ్చర్యపోతున్నారా.. ప్రత్యేక హోదా కోసం ఏమైనా చేస్తున్నారా?. మీ వ్యాపారాల కోసం పదవుల్లో కొనసాగవద్దని ఆయన ఎంపీలకు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో తెలంగాణా ప్రాంత ఎంపీలు ఎంత పోరాడారో కళ్ళారా చూసిన ఎంపీలకు తమకు ప్రత్యేక ప్రతిపత్తి రాని విషయంలో వారి పోరాటాన్ని స్ఫూర్తిగా చేసుకుని పార్లమెంట్‌లో ప్రశ్నించలేరా అని అన్నారు.

బీజేపీ తరఫున ఇద్దరు ఎంపీలున్నారు.. మీరు ఏం చేస్తున్నారు. హైకమాండ్ మీద నమ్మకం ఉందంటూ కాలం గడిపేస్తున్నట్లు కనిపిస్తోంది.