రైతు సమస్యలు రాత్రికి రాత్రే తీరేవి కావు : కేసీఆర్

telangana-assemblyతెలంగాణాలో రైతు సమస్యలు రాత్రికి రాత్రే తీరేవి కావని సీఎం కేసీఆర్ అన్నారు .  రాష్ట్ర అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చలో కేసీఆర్ మాట్లాడుతూ , తెలంగాణ వివక్షతకు గురైందని అందువల్లే ఇప్పటికీ సమస్యలు ఉన్నాయన్నారు. 1960 లో ప్రారంభమైన ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదని, ఆంధ్రాపాలకుల పాలనలో తెలంగాణ అభివృద్ది దిగజారిపోయిందన్నారు.

తెలంగాణా లో తీవ్రమైన కరవు దానికి తోడు కరెంటు కోతలు ఉండేవన్నారు. వ్యవసాయ యూనివర్శిటీని పరిశోదన లేకుండా ద్వంసం చేశారని, వచ్చే మార్చి తర్వాత ఉదయం పూటనే రైతులకు 9 గంటలకు విద్యుత్‌ సరఫరా చేస్తామని , రైతులు ఆత్మహత్యలు చేసుకోవవద్దని ఆయన పేర్కొన్నారు.

రైతు రుణాలు మాఫీ చేయడం జరిగిందని, ఇప్పటికే రైతు రుణమాఫీ రూ. 8 వేల కోట్లకు పైగా విడుదల చేసినట్లు సభకు తెలిపారు. వ్యవసాయ శాఖలో 15వందల పోస్టులు భర్తీ చేసినట్లు చెప్పారు.

దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. ఈ చర్చల్లో ప్రతిపక్షాల నుండి మంచి సలహాలు వస్తాయని ఆశించానని అలాంటివి ఏవీ రాలేదని చెప్పారు.