మహేష్ బాబు కు బీర్ తో అబిషేకం

mahesh-beerమహేష్ బాబు నటించిన శ్రీమంతుడు బాక్స్ ఆఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాడు , ఈ సక్సెస్ తో మహేష్ ఫాన్స్ కి బాగా కిక్ ఎక్కినట్లుంది .

శ్రీమంతుడు సినిమా బాబు అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చింది దాంతో వారు తమ అభిమాన హీరోని ఏకంగా బీర్ తో అభిషేకించి పండగ చేశారు.

కొద్దిరోజుల క్రితం బాహుబలి సినిమా విడుదల రోజున ప్రభాస్ అభిమాని ఒకరు మేకని బలిచ్చి హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇపుడు బాబు అబిమానులు కూడా ఇలా హడావుడి చేసి న్యూస్ లో నిలిచారు.