నా చిత్తశుద్ధిని శంకిస్తే నేను వేరే వ్యక్తిని : పవన్ కళ్యాణ్

pawan4జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పెనుమాకలో జరిగిన సభలో మాట్లాడుతూ , ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అన్నయ్య మనస్సు గాయపరిచి ప్రజల పక్షాన నిలిచి టీడీపీ-బీజేపీ కి సపోర్టు చేసానని , తన చిత్తశుద్ధిని శంకిస్తే తను వేరే వ్యక్తిని అని అన్నారు .

తన అన్నయ్య మనసు గాయపర్చి టీడీపీ-బీజేపీకి మద్దతు ఇచ్చానని , అధికారం, సీట్లు కావాలని కోరుకోలేదని, తన కులస్తులంతా తన చుట్టు తిరిగారని ప్రముఖ పేపర్లో వచ్చిన వార్తలు తనన్ను బాధించాయిని ,దయచేసి తనకు కులాన్ని అంటగట్టొద్దు, అని అన్నారు.

తాను కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని దాటిన వ్యక్తినని, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు తనకు సమానమేనని , తనకు ఉన్న ఇద్దరి కుతురులలో ఒకరికి యేసు క్రీస్తు పేరు ఇంకో కూతురుకి హిందూ పేరు పెట్టానని దయచేసి నన్ను ఏ కులానికి అంటకట్టకండని అన్నారు .