బలవంతంగా భూములను లాక్కోవద్దు : పవన్ కళ్యాణ్

pawan-3జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ తన కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని చెప్పారు , కాదని భూసేకరణ చేస్తే కచ్చితంగా ధర్నా చేస్తానని చెప్పారు .

పెనుమాకలో జరిగిన సభలో ఆయన ప్రసంగాన్ని ముగిస్తూ బూసేకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని, రైతులు ఇష్టపడి ఇస్తే భూములు తీసుకోవలని , ఇష్టపడని రైతులను ఒప్పించి తీసుకోవలని, బలవంతంగా భూములను లాక్కోవద్దు, లాక్కోవద్దు, లాక్కోవద్దు అని మరిమరి హెచ్చరించారు .

తాను రైతులకు అండగా ఉంటానని, రైతుల కష్టం తనకు కూడా తెలుసునని, తను కూడా రైతునే అని , కూరగాయలు పండించడం తనకు తెలుసునని, తను ఎక్కడికీ పారిపోనని , రైతుల వెంటే ఉంటానని ఆయన అన్నారు.