దిగ్విజయ్ ‘ఓ లోఫర్’ : డి.శ్రీనివాస్‌

dsపీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్ ఓ లోఫర్ అని , ఈరోజు తన జీవితంలో చాలా బాధాకరమైన రోజు అని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని పదవుల కోసం వీడలేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో తనకు ఎన్నో అవకాశాలను ఇచ్చిన పార్టీ అధినేత్రి సోనియాకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు . 1969లో గాంధీభవన్‌లో అడుగుపెట్టానని చెప్పారు. సోనియా నాయకత్వంలో పనిచేశానని డీఎస్‌ తెలిపారు . ఎమ్మెల్సీ పదవి తనకు ఒక లెక్క కాదన్నారు. చెప్పుడు మాటలు విని మాట్లాడుతున్న దిగ్విజయ్ ‘ఓ లోఫర్’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా అయితే, తెచ్చింది మాత్రం కేసీఆర్ అని చెప్పారు, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్‌ చాలా కమిట్‌మెంట్‌తో పనిచేస్తున్నారని కొనియాడారు. తాను పదవులు ఆశించి తెరాసలో చేరడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతీ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డుపడుతోందని. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని అన్ని పార్టీలు ఐక్యతతో పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం తెలంగాణను అభివృద్ధి చేసే క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.