లోకేష్‌ కరప్షన్ చంద్రబాబుకు తెలుసా? లేదా? : పవన్‌కల్యాణ్‌

pawan-4884పవన్‌కల్యాణ్‌ ఆధ్వర్యంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా గుంటూరు ప్రాంగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.

ఈ మహాసభ ద్వారా పవన్‌కల్యాణ్‌ అధికార తెలుగుదేశం పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించారు. “ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే కంచె చేను మేసినట్టుంది, టీడీపీ ప్రభుత్వం మాట్లాడిన మూడు మాటల్లో ఆరు అబద్ధాలున్నాయి. రాజధానికి 1500 ఎకరాలు చాలని సీఎం చంద్రబాబు నాతో అన్నారు… ఇప్పుడది లక్ష ఎకరాలదాకా విస్తరిస్తోంది. లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతున్నాయి… కానీ, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు.

ఆంధ్రప్రదేశ్‌ని టీడీపీ ప్రభుత్వం కరప్షన్ ఆంధ్రాగా మార్చింది. లోకేష్‌ కరప్షన్ చంద్రబాబుకు తెలుసా? లేదా?… లేకపోతే తెలిసే చేయిస్తున్నారా? . 2019 ఎన్నికలు టీడీపీకి 2014లో ఉన్నంత సుఖంగా మాత్రం ఉండబోవు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతితో ప్రజల్లో భయం ఏర్పడింది . నారా లోకేష్‌ చేసే అవినీతి చూస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది . 2019లో పవన్ మాతో ఉంటాడో లేడో తెలియదు కాబట్టి అవినీతికి పాల్పడతామంటే ఎలా?. దేశంలో ఎక్కడా లేనంత అవినీతి ఏపీలో ఉంది… అవినీతి చేసేవాళ్లని తరిమి తరిమి కొట్టాలి.

ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వోపైన దాడి చేస్తారా? దాడి చేసిన ఎమ్మెల్యేను రక్షిస్తారా?. ఈ రోజు నుంచి టీడీపీ వైఫల్యాలను ఎండగడుతాం… ఇసుక మాఫియాకు అమ్ముడు పోయినందకు నిలదీస్తాం. భూ తల్లిని అడ్డంగా తొవ్వేస్తే… ఆ తల్లి మిమ్మల్ని భూమిలోకి లాక్కెళ్తుంది.

సింగపూర్ తరహా రాజధాని కావాలంటే సింగపూర్ తరహా పాలన కావాలి… సింగపూర్‌లో మహిళా అధికారిపై దాడి చేస్తే ఆ వ్యక్తి తోలు ఊడిపోయేలా కొట్టేవాళ్లు. ఓటుకి నోటు కేసులో మీరు (చంద్రబాబు) దొరికిపోతే అందరూ చేసే పనిగా అని ఆ రోజు నేను ప్రశించలేదు. ప్రశ్నిస్తే నా వల్ల రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం జరగదేమో అని ప్రశించలేదు.

హోదాపై నేను మాట్లాడినప్పుడు చీకటి ఒప్పందాలు చేసుకుని ప్యాకేజీకి రెడీ అయ్యారు . ఏపీలో సరికొత్త రాజకీయశకం మొదలైందంటూ మీరు చేసిన తప్పులను ప్రజలకు వివరిస్తామని టీడీపీని ఉద్దేశించి తేల్చి చెప్పారు “,  పవన్‌కల్యాణ్‌.