‘ధృవ’లో నా కష్టానికి మంచి కథ తోడైంది – రాంచరణ్

ramcharanరాంచరణ్ ‘ధృవ’ సినిమా డిసెంబర్ 9 న విడుదలై ఘన విజయం సాధించింది , ఈ విజయంతో మంచి కిక్ మీదున్న చరణ్ తన సంతోషాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు .

ఓ ప్రేక్షకుడిగా ‘ధృవ’ సినిమా చూసినప్పుడు చాలా మంచి సినిమా చూశాను అనిపించింది. ‘ధృవ’లో నా కష్టానికి మంచి కథ తోడైంది. ‘రేసుగుర్రం’ కంటే ముందునుంచే దర్శకుడు సురేందర్‌రెడ్డితో ప్లాన్‌ ఉంది… ‘ధృవ’కు కుదిరింది.అరవింద్‌స్వామి యాక్షన్‌ హైలెవల్‌లో ఉంటుంది, ‘ధృవ’లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నా అన్నారు చరణ్ .

‘ధృవ’లో ఫర్మామెన్స్‌ గురించి నాన్న చిరంజీవి మాట్లాడినప్పుడు యాక్టర్‌గా నాకు చాలా సంతృప్తి అనిపించిందిని , చిరంజీవి ఖైదీ 150 తరువాత అన్నీ కూదిరితే సురేందర్‌రెడ్డితో సినిమా ఉంటుంది రాంచరణ్ అన్నారు .

తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రస్తావిస్తూ రాంచరణ్ ఇలా అన్నారు, ప్రస్తుతం సుకుమార్‌తో ప్రాజెక్ట్‌ ఉంది, మరో రెండు, మూడు ప్రాజెక్టులను నేను కన్‌ఫర్మ్‌ చేయలేదు.