ధనలక్ష్మీ తలుపు తడితే రివ్యూ

Dhanalakshmi Talupu Tadithey -review

Dhanalakshmi Talupu Tadithey Movie Review

Title : Dhanalakshmi Talupu Tadithey
Directed by Sai Achyuth Chinnari
Produced by Tummalapalli Rama Satyanarayana
Prasad Mallu,Pratap Bheemi Reddy
Starring : Dhanraj,Sri Mukhi,Naga babu,Manoj Nandam,Ranadheer,Anil Kalyan,Vijay Sai,Sindhu Tolani
Music by Bole Savali
Production company :Bhimavaram Talkies
TeluguSquare.com Rating : 3/5
Story :

మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్స్‌ రణధీర్‌(రణధీర్‌), శ్రీముఖిలు పార్లమెంట్‌ సభ్యురాలు వసుంధర (సింధు తులాని) మేనల్లుడైన బాలుడ్ని కిడ్నాప్‌ చేసి కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తారు. డబ్బు తీసుకోనే సమయానికి ఆక్సిడెంట్ అవుతుంది . మరోపక్క ఐదుగురు స్నేహితులు తనీష్‌ (తనీష్‌), కోడి(ధనరాజ్‌), పండు(మనోజ్‌ నందం), చిట్టి(అనిల్‌ కళ్యాణ్‌), విజయ్‌ సాయి(సత్తి) ప్రయాణిస్తుండగా మార్గం మధ్యలో వారికి చిన్నపిల్లాడు కన్పిస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వసుంధర వారికి కోటి రూపాయిల బ్యాగ్‌ ఇచ్చి వెళ్ళిపోతుంది . ఈ షాక్ నుంచి తేరుకొనే లోపే స్నేహితులు విడిపోతారు. ఇద్దరు అడవిలోని ఆదివాసుల చేతిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమయింది? కోటి రూపాయల సంగతి ఏంటి ?

Analysis:

దర్శకుడిగా సాయి అచ్యుత్‌ మొదటి సినిమా ఇది , కానీ సినిమాని బాగా డీల్‌ చేసాడు , ఎంటర్‌టైన్‌గా ఆసక్తికరంగా తెరకెక్కించాడు. మొదటిపార్ట్‌లో 40 నిమిషాలు , క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాలు చాల బాగుంది . ధనరాజ్‌ అడవిలో పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ గెట్ అప్ లో అలరించాడు . రణధీర్‌ నెగటివ్‌ పాత్ర మెప్పించాడు. పోలీస్‌ ఆఫీసర్‌గా నాగబాబు తన సోదరుడు పవన్‌ కళ్యాణ్‌ని ఇమిటేట్‌ చేస్తూ ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. టీవీ రిపోర్టర్‌ గంట పాత్రలో తాగుబోతు రమేష్‌ కాసేపు అలరిస్తాడు. కామెడీ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌ కాయం , కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని డ్రాగింగ్ సీన్స్ లు , లాజిక్కులు మిస్ అవ్వడం మాములే .