కాంగ్రెస్‌ పార్టీకి డి. శ్రీనివాస్‌ రాజీనామా

dsపీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ బుధవారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క్యాంప్‌ కార్యాలయంలో కలుసుకున్నారు. ఆఫీస్ కు రావడంతో ఆయన టిఆర్ఎస్ లో చేరడం ఖరారైనట్లేనని భావిస్తున్నారు.

ఆయన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో డీఎస్‌ ఎమ్మెల్సీ పదవిని రెన్యువల్‌ చేయకపోవడం, దిగ్విజయ్ సింగ్ తనను అవమానించారని ఆయన భావిస్తున్నారు.

డి.శ్రీనివాస్ ను బుజ్జగించడానికి తెలంగాణ కాంగ్రెస అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, వర్కింగ్ అద్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డి.కె. అరుణ లు డి.ఎస్ .ఇంటికి వెళ్లారు. కాని శ్రీనివాస్ వారిని కలువలేదు.