శవ రాజకీయాలు : చిరంజీవిపై క్రిమినల్ కేసు ?

chiranjeevi-46646ఏపీకి ప్రత్యేక హోదా కోసం తిరుపతిలో ఒక నిండుప్రాణం బలిదానం అయి గంటలు గడవకముందే శవ రాజకీయాలు మొదలైనవి .

ఒకపక్క , మునికోటి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్, వైసీపీ పార్టీలు ఆరోపిస్తుండగా , మరోపక్క, కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టాలని టిడిపి డిమాండ్ చేసింది.

మునికోటి మృతికి కాంగ్రెస్ పార్టీ నే కారణమని, అవగాహన లేని కాంగ్రెస్ నేతలు బావోద్రేకాలు రెచ్చగొట్టారని అందువల్లనే ఇది జరిగిందని ఆరోపించారు. టిడిపి ప్రదాన కార్యదర్శి వర్ల రామయ్య.

పిసిసి అద్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య,ఎమ్.పి జెడి శీలం, మాజీ మంత్రి శైలజానాద్, తులసిరెడ్డి తదితరులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసారు