రేవంత్ రెడ్డి తప్పా.. ఒప్పా అనేది కోర్టులు నిర్ణయించాలి : వపన్

pawan2సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌‌లో తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వపన్ కళ్యాణ్ మాట్లాడారు .

అవినీతి గురించి మాట్లాడాతానన్నావు.. ఎందుకు మాట్లాడలేదని ఎంపీ వి.హనుమంతరావు అన్నారని నా దృష్టికి వచ్చింది. వర్తమాన రాజకీయాలు నీతి, నిజాయితీలకు పుట్టినిల్లు కావని చిన్న పిల్లాడు కూడా చెబుతాడు. రేవంత్ రెడ్డి విషయం తప్పా.. ఒప్పా అనేది కోర్టులు నిర్ణయించాలి.ఇలాంటి సమయంలో ఇంత రాజకీయ క్రీడలు ఆడే పద్ధతి రెండు రాష్ట్రాలకు ఉందా అనిపిస్తోంది.

పార్టీలు నేతలను ఆకర్షించవచ్చు గానీ, ప్రజలు ఆలోచనలను మార్చగలరా? అని ప్రశ్నించారు. రాజకీయ క్రీడలో భాగంగానే రేవంత్ రెడ్డి వ్యవహారమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.