రేవంత్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ

revanthఓటుకు నోటు కుంభకోణంలో నిందుతుడైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు ఈరోజు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఏసీబీ అధికారులు తనను బెదిరించి బలవంతంగా వాంగ్మూలాన్ని తీసుకున్నారని ఉదయ్‌సింహ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు ఈనెల 14కి వాయిదా వేసినట్లు న్యాయ మూర్తి తెలిపారు.

రేవంత్ రెడ్డికి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది, కొడంగల్‌కే పరిమితం కావాలన్న షరతుతో రేవంత్‌కి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేతగా ఉన్న తాను హైదరాబాదులో ఉండాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఆ షరతును సడలించాలని రేవంత్ రెడ్డి హైకోర్టును కోరారు. రేవంత్ పిటిషన్‌ను ఏసీపీ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహల బెయిల్ షరతులను కోర్టు కొంతమేర సడలించింది.

court,.rejects, revanth,relaxation,petition,tdp mla , high court acb,cash for vote