జగన్ శిలువతో పుష్కర స్నానం – విమర్శల వెల్లువ

jagan-bathవైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పుష్కరస్నానం చేయడంపై హిందూ సంస్థల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

జగన్ కొవ్వూరులో గోదావరి పుష్కర స్నానం చేశారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి అక్కడే పిండ ప్రధానం కూడా చేశారు. అయితే జగన్ పుష్కరస్నానం మీద తాజాగా విమర్శల వర్షం కురుస్తోంది. ఏపి మంత్రి అచ్చెన్నాయుడు జగన్ మీద విమర్శల దాడి చేశారు. ప్రభుత్వం మూడ నమ్మకాలను ప్రోత్సహిస్తోంది అంటూనే.. పుష్కరస్నానం ఎలా చేశారని మండిపడ్డారు.‘దేవుళ్ల పట్ల నమ్మకం లేనివాడివి నీవెందుకు ఆచారాలను కొనసాగిస్తున్నావు’ అని ప్రశ్నించారు.

అయితే జగన్ గోదావరిలో మునిగే సమయంలోనూ మెడలో శిలువ ఉండటంతో పలువురు విమర్శలు చేస్తున్నారు , శిలువతో పుష్కర స్నానం – విమర్శల వెల్లువ… హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యవహరించారని, నమ్మకం లేకపోతే పుష్కర స్నానం చెయ్యకుండా ఉండాల్సిందని.. అంతే తప్ప ఇలా హిందు సంస్రృతిని అవమానించడం ఏంటని వారు అంటున్నారు.