కుంభమేళాకు కండోమ్‌ల కొరత

kumbhmelaఈ నెల 14 నుంచి నాసిక్‌లో జరుగనున్న కుంభమేళాకు సరిపడ కండోమ్‌లు లేవని మహారాష్ట్ర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అంటోంది.

‘కుంభమేళా సమయంలో దాదాపు కోటి మంది నాసిక్‌‌కు వస్తారు. చాలా మంది రెండు నుంచి మూడు రోజులు ఇక్కడే ఉంటారు. వారంతా ప్రొటక్షన్ లేకుండా సెక్స్‌లో పాల్గొంటే హెచ్ఐవీ వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

నాసిక్‌లో రెండు వేల మంది మహిళా సెక్స్ వర్కర్లు, 560 మంది పురుష సెక్స్ వర్కర్లు, 70 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. సాధారణంగా నెలకు 1.5 నుంచి 2 లక్షల వరకు కండోమ్‌లు వినియోగం అవుతుంటాయని తెలుస్తోంది.