రేవంత్‌కు కండిషనల్ బెయిల్ మంజూరు

ఓటుకు నోటు కేసులో ప్ర‌థ‌మ ముద్దాయి అయిన ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు రూ 5 లక్షలు, రెండు షూరిటీలతో కూడిన యిల్‌
ఏ-2, ఏ-3, నిందితులకు షరతులతో కూడిన బెయిల్‌.

ఈ కేసులో రేవంత్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాల‌ను తారుమారు చేస్తార‌న్న‌ తెలంగాణ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వాద‌న‌ల‌తో హైకోర్టు ఏకీభ‌వించ‌లేదు. రేవంత్‌ను ఇంకా విచారించాల్సి ఉంద‌ని, కొన్ని కీల‌క ఆధారాలు ల‌భ్య‌మైనందున వాటి ఆధారంగా మ‌రికొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఆయ‌న నుంచి రాబ‌ట్టాల్సి ఉంద‌ని ప్రాసిక్యూష‌న్ వాదించింది.

అయితే రేవంత్‌ను రాజ‌కీయ క‌క్ష‌సాధింపులో భాగంగానే ఈ కేసులో ఇరికించార‌న్న రేవంత్ న్యాయ‌వాది వాద‌న‌తో కోర్టు ఏకీభ‌వించింది. ఈ కేసులో అరెస్ట్ అయిన మ‌రో ఇద్ద‌రు స‌హ‌ నిందితులు సెబాస్టియ‌న్‌, ఉద‌య్‌సింహ‌ల‌కు కూడా బెయిల్ ల‌భించింది. ఈ ఇద్ద‌రూ కూడా ఐదు ల‌క్ష‌లతోపాటు ఇద్ద‌రు వ్య‌క్తుల పూచీక‌త్తు ఇవ్వాల్సి ఉంటుంది. రేవంత్‌ సొంత నియోజ‌క‌వ‌ర్గం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా కొడంగ‌ల్‌, హైద‌రాబాద్‌లు దాటి పోరాద‌ని హైకోర్టు ఆదేశించింది. ముగ్గురు నిందితులు కూడా పాస్ పోర్టును కూడా కోర్టుకు స‌రెండ‌ర్ చేయాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశించారు. అవినీతి నిరోధ‌క‌శాఖ అధికారుల‌కు అందుబాటులో ఉండాల‌ని, విచార‌ణ‌కు ఎప్పుడు పిలిచినా వెళ్ళి స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. రేవంత్‌కు బెయిల్ ల‌భించ‌డంతో ప్ర‌స్తుతం చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉన్నఆయ‌న రేపు విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ హైకోర్టు నుంచి పేప‌ర్లు స‌కాలంలో అందితే ఈరోజు సాయంత్రం ఐదు గంట‌ల‌లోపు విడుద‌ల కావ‌చ్చు. లేక‌పోతే విడుద‌ల రేపే అవుతుంది.